భారతదేశం, ఫిబ్రవరి 16 -- Divija Prabhakar: సీరియ‌ల్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ప్ర‌భాక‌ర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీతో ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ద్రి సినిమాలోని సూప‌ర్ హిట్ సాంగ్‌ను పేరుగా ఫిక్స్ చేశారు. హే చికీతా అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా న‌టిస్తోన్నాడు. దివిజ ప్రభాకర్‌తో పాటు తన్మయి మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. సినిమాటోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్ గ‌రుడ వేగ అంజి...అశోక ఆర్ఎన్ఎస్‌తో క‌లిసి హే చికితా సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

ఈ రొమాంటిక్ మూవీతో ధ‌న‌రాజ్ లెక్క‌ల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. హే చికీతా మూవీలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ రాజ్,దేవి ప్రసాద్, ప్రభాకర్, వీర శంకర్, బలగం సుజాతతో పాటు మై విలేజ్ షో ఫేమ్‌ అంజి మామ, గంగవ్...