భారతదేశం, ఫిబ్రవరి 17 -- Dhanraj Interview: సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో క‌మెడియ‌న్‌గా సూప‌ర్‌హిట్‌ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు ధ‌న్‌రాజ్‌. జ‌బ‌ర్ద‌స్థ్‌తో పాటు ప‌లు కామెడీ షోస్ చేశాడు. క‌మెడియ‌న్‌గా త‌న‌ను తాను నిరూపించుకున్న ధ‌న్‌రాజ్ రామం రాఘవం మూవీతో డైరెక్ట‌ర్‌గా మారుతున్నాడు. స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీ ధ‌న్‌రాజ్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 21న ఈ మూవీప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రామం రాఘ‌వం విశేషాల‌తో పాటు త‌న సినీ జ‌ర్నీ గురించి ధ‌న్‌రాజ్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ప్ర‌త్యేకంగా ముచ్చటించారు. ఆ సంగ‌తులు ఇవే.

యాక్ట‌ర్‌గా ఇప్ప‌టివ‌ర‌కు 90 సినిమాల వ‌ర‌కు చేశా. రామం రాఘ‌వం మూవీతో ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నా. ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగుపెడుతోన్న‌ ఫీలింగ్ క‌లుగుతోంది. నీకు డైరె...