భారతదేశం, మార్చి 31 -- Devadula Project: ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే దేవాదుల పైపులైన్ మూడు చోట్లా లీకవగా.. ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఆదివారం టన్నెల్ లీక్ అవడం కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు వెంటనే మోటార్లు బంద్ చేసి లీకేజీలను గుర్తించే పనిలో పడ్డారు.
దేవాదుల మూడో దశ పనుల్లో భాగంగా రామప్ప చెరువు నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు నీటిని తరలించేందుకు రామప్ప నుంచి దేవన్నపేట వరకు 49.06 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేశారు. దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి ధర్మసాగర్ కు నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండగా, ఇక్కడి నుంచి రిజర్వాయర్ వరకు పైపులైన్ వేశారు.
రిజర్వాయర్ సమీపంలో మిషన్ భగీరథ నిర్మాణాల కారణంగా అక్కడ 200 మీటర్ల మేర మరో టన్నెల్ ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉండగా.. క్షేత్రస్థాయిలో పంటలు ఎండుతున్న కారణంగా ఈ నెల 27 మంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.