భారతదేశం, నవంబర్ 11 -- సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో ఓ కారు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. 24మంది గాయపడ్డారు. ఈ ఘటనతో దిల్లీ పోలీసులు అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అయితే, ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు.. బాంబు పేలుడేనా? ఇందులో ఉగ్ర కోణం ఉందా? అనే విషయంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ ఈ ఘటనపై యూఏపీఏ కింద కేసు నమోదు చేయడంతో, దిల్లీ పోలీసులు ఉగ్ర కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టమైంది.

వాహనాలకు నష్టం: పేలుడు సంభవించిన తర్వాత, మరో మూడు నుంచి నాలుగు వాహనాలకు కూడా మంటలు అంటుకుని, వాటికి తీవ్ర నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.

క్షతగాత్రులకు చికిత్స: గాయపడిన వారిని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు....