భారతదేశం, జనవరి 28 -- చైనా మరో అద్భుతం చేసింది! ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ రంగంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ "డీప్​సీక్​".. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ మోడళ్లను రూపొందించి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. దీనిని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాల్లోని లీడింగ్​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా సిలికాన్​ వ్యాలీలోని దిగ్గజ టెక్​ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా టెక్​ ఇండెక్స్​ కుప్పకూలింది. అసలేంటి ఈ డీప్​సీక్​?

డీప్​సీక్​ ఏఐ మోడల్​ని డీప్​సీక్​ ఆర్​1 అని పిలుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్​లో స్పెషలైజేషన్ చేసిన ఇంజినీర్, ఎంటర్​ప్రెన్యూర్ లియాంగ్ వెన్​ఫెంగ్ 2023లో ఈ డీప్​సీక్​ని స్థాపించారు. డీప్​సీక్ సృష్టించడానికి ముంద...