భారతదేశం, జనవరి 26 -- నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా మంచి సక్సెస్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ యాక్షన్ డ్రామా మూవీకి బాబీ లొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం సుమారు రూ.130కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‍పై రూమర్లు స్ట్రాంగ్‍గా వినిపిస్తున్నాయి.

డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్‍కు ముందే నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ చేసుకుందట. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీ...