భారతదేశం, అక్టోబర్ 4 -- అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ సీజన్ మొదటి తుపాను 'శక్తి'! శుక్రవారం నాటి ఐఎండీ నివేదిక ప్రకారం.. ఇది గుజరాత్​ ద్వారకకు సుమారు 300 కిమీ, పోర్‌బందర్‌కు 360 కిమీ పశ్చిమాన కేంద్రీకృతమై ఉంది. శనివారం నాటికి ఇది మరింత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్​, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) వెల్లడించింది.

ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు 13 దేశాలు అందించిన జాబితా నుంచి వాతావరణ శాఖ వరుసగా పేర్లు పెడుతుంది. ఈసారి శక్తి పేరును శ్రీలంక ప్రతిపాదించింది. తుపాను గంటకు 62 కిమీ వేగాన్ని (34 నాట్లు) అందుకుంటేనే ఈ పేరు ఉపయోగిస్తారు!

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, అక్టోబర్ 7 వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను భారతదేశం నుంచి వ...