భారతదేశం, ఫిబ్రవరి 3 -- కర్ణాటకలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! స్కూల్​ వాష్​రూమ్​లో తన 8ఏళ్ల కూతురిపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటక మాండ్యా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జనవరి 31న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్​ వాష్​రూమ్​లో 8ఏళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ఈ విషయాన్ని బాలిక ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని వారు బెదిరించడంతో మౌనంగా ఉండిపోయింది. కానీ ఆదివారం, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పింది. ఆ మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

ఈ విషయంపై పోలీసులు మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారు.

"బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి చెబుతోంది. రెండొవ తరగతి చదువుకుంటున్న బాలికను...