భారతదేశం, మార్చి 22 -- మధ్యప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. మందసౌర్​ జిల్లాలో 2023లో హత్యకు గురైన ఓ మహిళ దాదాపు రెండేళ్ల తర్వాత మార్చ్​ 11న క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ మహిళ హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారు.

2023 సెప్టెంబర్​లో మందసౌర్​లోని గాంధీ సాగర్ ప్రాంతానికి చెందిన లలితా బాయి (35) అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్​లోని ఝబువాలోని థాండ్లా పట్టణంలో ఆమె 'హత్య' జరిగిదని కేసు నమోదైంది.

తల చితికిపోయిన ఒక మహిళ మృతదేహాన్ని లలితా బాయి బంధువులు చూశారు. ఆది లలితా బాయిదే అని భావించారని గాంధీ సాగర్ పోలీస్​స్టేషన్ ఇన్​చార్జి తరుణ భరద్వాజ్ తెలిపారు.

"మేము మిస్సింగ్ కేసు నమోదు చేసిన తరువాత, తల నలిగిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు తండ్లా పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి ప...