భారతదేశం, మార్చి 28 -- Crime Drama OTT: మ‌ల‌యాళం క్రైమ్ డ్రామా మూవీ ది గాంబినోస్ ఆరేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి రిలీజైంది. శుక్ర‌వారం నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ది గాంబినోస్ మూవీలో రాధికా శ‌ర‌త్‌కుమార్‌, సంప‌త్‌రాజ్‌, విష్ణు విన‌య్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. గిరీష్ ఫ‌ణిక్క‌ర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ది గాంబినోస్ మూవీ 2019లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. హాలీవుడ్ ఆస్కార్ నామినేట్ మూవీ యానిమ‌ల్ కింగ్‌డ‌మ్ ఆధారంగా ద‌ర్శ‌కుడు ఈ మ‌ల‌యాళ సినిమాను తెర‌కెక్కించాడు. ప్ర‌తిభావంతుడైన యాక్ట‌ర్లు, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ది గాంబినోస్ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ది గాంబినోస్ మూవీలో రాధిక శ‌ర‌త్‌కుమార్ లేడీ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. ఆమె క్యారెక్ట‌ర్ మాత్రం మ‌ల‌యాళ ఆడియెన్స్‌ను మెప్పించింద...