భారతదేశం, ఏప్రిల్ 1 -- CPM General Secretary: ఏప్రిల్ 1 నుంచి 6 వ‌ర‌కు ఐదు రోజుల పాటు త‌మిళ‌నాడులోని మ‌దురైలో జ‌రిగే సీపీఎం అఖిల భార‌త 24వ మ‌హాస‌భలు చారిత్రాత్మ‌కం కాబోతున్నాయి. ఎందుకంటే ఈ మ‌హాస‌భ‌లో అనేక మంది సీనియ‌ర్లు రిలీవ్ కాబోతున్నారు. ఈ మ‌హాస‌భ‌ల్లో అనేక కొత్త ముఖాలు కేంద్ర క‌మిటీలోకి ఎంట‌ర్ కాబోతున్నాయి. అలాగే కేంద్ర క‌మిటీలో మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్య‌త ల‌భించ‌నుంది.

సీపీఎం తొమ్మిదో అఖిల భార‌త మ‌హాస‌భలు త‌మిళనాడులోని మ‌దురైలో 1972 జూన్ 27 నుంచి జూలై 2 వ‌ర‌కు జ‌రిగాయి. మ‌ళ్లీ 53 ఏళ్ల త‌రువాత మ‌దురైలో 24 మ‌హాస‌భలు జ‌రుగుతున్నాయి. అందుకు మాత్రమే కాదు, ఈ మ‌హాసభ చారిత్రాత్మ‌కం కాబోతోంది. ఈ మ‌హాసభ‌లో అనేక కీల‌క నిర్ణ‌యాలు ఉండబోతున్నాయి. మోడీ ఫాసిస్ట్ పోక‌డ‌ల‌తో పాల‌న సాగిస్తోన్న నేప‌థ్యంలో ఈ మహాస‌భ‌ కీల‌కంగా మారింది. అంతేకాకుండా సీపీఎం...