భారతదేశం, ఫిబ్రవరి 19 -- Comedy Thriller OTT: వెన్నెల కిషోర్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది.ఇప్ప‌టికే ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బుధ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ.

వెన్నెల కిషోర్ హీరోగా న‌టించిన ఈ మూవీలో అన‌న్య నాగ‌ళ్ల‌, ర‌వితేజ మ‌హాదాస్యం, శియా గౌత‌మ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించాడు. డిటెక్టివ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు రైట‌ర్ మోహ‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ అందించాడు.

క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ థియేట‌ర్ల‌లో రిలీజైంది. వెన్నెల‌కిషోర్ హీరో కావ‌డం, చంట‌బ్బాయి తాలూకా అనే క్యాప్ష‌న్‌తో పాటు టీజ‌ర్‌,...