భారతదేశం, ఫిబ్రవరి 23 -- Comedy OTT: విశ్వ‌క్‌సేన్ లేడీ గెట‌ప్‌లో క‌నిపిస్తూ ప్ర‌యోగాత్మ‌కంగా చేసిన లైలా మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. విశ్వ‌క్‌సేన్ కెరీర్‌లోనే దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో పాటు ప్ర‌మోష‌న్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో లైలా మూవీ ఆస‌క్తిని రేకెత్తించింది. కాన్సెప్ట్ ఔట్‌డేటేడ్ కావ‌డంతో ఆడియెన్స్ ఈ మూవీని తిర‌స్క‌రించారు.

లైలా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల కాక‌ముందే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా డిజిట‌ల్‌ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న‌ది. మార్చి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో విశ్వ‌క్‌సేన్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ మార్చి ఫ‌స్ట్ వీక్‌లో రానున్న‌ట్లు స‌మాచారం.

లైలా మూవీకి రామ్ నారాయ‌ణ్ ...