భారతదేశం, మార్చి 11 -- Comedy OTT: త‌మిళ మూవీ 2కే ల‌వ్‌స్టోరీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 14న ఆహా త‌మిళ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో 2కే ల‌వ్‌స్టోరీ మూవీ రిలీజ్ అవుతోంది. ఆహా త‌మిళ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో జ‌గ‌వీర్‌, మీనాక్షి గోవింద‌రాజ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. బాలా శ‌ర‌వ‌ణ‌న్‌, ఆంటోనీ భాగ్య‌రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2కే ల‌వ్‌స్టోరీ మూవీకి సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

మోడ్ర‌న్ డే ఫ్రెండ్‌షిప్స్‌, రిలేష‌న్స్ ఎలా ఉంటున్నాయ‌న్న‌ది బోల్డ్ పంథాలో వినో...