భారతదేశం, మార్చి 23 -- బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా న‌టించిన రొమాంటిక్ కామెడీ మూవీ బూట్‌క‌ట్ బాల‌రాజు యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మేఘ‌లేఖ, సిరి హ‌నుమంతు హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సునీల్‌, ఇంద్ర‌జ‌, బిగ్‌బాస్ అవినాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీను కోనేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో బూట్‌క‌ట్ బాల‌రాజు మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. సోహైల్ క్రేజ్‌తో పాటు వెరైటీ ప్ర‌మోష‌న్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. కామెడీ బాగానే ఉన్నా కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లోపించ‌డంతో క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఊరి పెద్ద అయిన ప‌టేల‌మ్మ...