భారతదేశం, ఫిబ్రవరి 3 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఊహలకు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి నుంచి కళ్లు చెదిరే వసూళ్లతో ఆశ్చర్యపరుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైన ఈ మూవీ బంపర్ బ్లాక్‍బస్టర్ సాధించింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ మైల్‍స్టోన్ దాటింది. దీంతో వెంకటేశ్ ఓ రికార్డు సృష్టించారు.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.303కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. నేడు (ఫిబ్రవరి 3) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రీజనల్ చిత్రాల్లో ఆల్‍...