Hyderabad, మార్చి 23 -- Chiyaan Vikram About SJ Suryah And Veera Dheera Soora: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర శూర. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ ఎస్‌జే సూర్య, మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరాముడు, హీరోయిన్ దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మార్చి 27న గ్రాండ్‌గా వీర ధీర శూర సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు వీర ధీర శూర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తెలుగు ఆడియెన్స్, వీర ధీర శూర, సినిమాలోని నటీనటుల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

హీరో విక్రమ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మాస్ సినిమాలు చేస్తున్నాను. కానీ, రస్టిక్‌గా ఉండే ...