భారతదేశం, జనవరి 3 -- ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 విజృంభించిన సరిగ్గా 5ఏళ్లకు చైనాలో కొత్త వైరస్​ కలకలం సృష్టిస్తోంది! దీని పేరు హ్యూమన్​ మెటాన్యుమోవైరస్​ (హెచ్​ఎంపీవీ). పలు నివేదికలు, సోషల్​ మీడియా కథనాల ప్రకారం ఈ వైరస్​ అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్​ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్​, స్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని తెలుస్తోంది.

ఈ హెచ్​ఎంపీవీలో ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. అంతేకాదు కరోనా వైరస్​ సోకినప్పుడు కనిపించిన లక్షణాలు కూడా ఈ హెచ్​ఎంపీవీ వైరస్​తో గుర్తించవచ్చు. కొత్త వైరస్​పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి, పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

"చైనాలో అనేక వైరస...