భారతదేశం, మార్చి 20 -- Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు, ఒక జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) జవాను మృతి చెందారు. కాంకేర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్ లలో మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.
''బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో ఉదయం 7 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ ఏరియా (బీజాపూర్) పరిధిలో భద్రతా సిబ్బంది సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోంది'' అని పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ కౌంటర్ అనంతరం, 18 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గాలింపు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు, కాంక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.