Hyderabad, ఏప్రిల్ 21 -- Chhaava Box Office: బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉంది. తాజాగా ఇండియాలో రూ.600 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా హిందీలో మూడో స్థానంలో ఉంది.

ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. ఇందులో లీడ్ రోల్లో విక్కీ కౌశల్ నటించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అయితే అటు బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ బాగానే వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఇండియాలోనే ఈ మూవీ నెట్ కలెక్షన్లు రూ.600 కోట్లు దాటాయి.

స్త్రీ2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ మూవీ ఇదే. ఇక పుష్ప 2 కూడా ఈ ఘనత సాధించినా.. అది హిందీలోకి డబ్ అయిన ...