భారతదేశం, ఫిబ్రవరి 3 -- Chevella Mla Gunman : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్న ముత్తంగి శ్రీనివాస్ (31) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం మండలంలోని వెలిమెల గ్రామంలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ అటెండ్ కావడానికి ఆదివారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే, దారి మధ్యలో తన వాహనానికి అడవి పంది తగలటంతో, బండి అదుపు తప్పి పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
రోడ్డు పక్కనే పడిన శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. చీకట్లో అతడిని ఎవరు గమనించలేదు. సోమవారం ఉదయం బాటసారులు గుర్తించి, అతడి ఐడెంటిటీ కార్డు ఆధారంగా పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.