భారతదేశం, మార్చి 26 -- Cheating Love: తూర్పు గోదావరి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధినిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రాజ‌ మ‌హేంద్ర వ‌రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన కౌలు రైతు దంప‌తుల‌కు పెళ్లైన 11 ఏళ్ల త‌రువాత ఆడ‌బిడ్డ పుట్టింది. ఆమె ప్రస్తుతం రాజ‌మహేంద్ర‌వ‌రం స‌మీపంలోని ఓ ఫార్మ‌సీ కాలేజీలో బీ ఫార్మ‌సీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోంది.

చ‌దువుకుంటునే రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప‌త్రిలో క్లినిక‌ల్ ఫార్మ‌సిస్టుగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఆసుపత్రిలో దీప‌క్ అనే ఉద్యోగి ఆమెతో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి దగ్గరయ్యాడు. పెళ్లి గురించి అడిగితే తాను పెళ్లి చేసుకోన...