భారతదేశం, ఫిబ్రవరి 19 -- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్-3 మిషన్‌ను చంద్రునిపై విజయవంతంగా దిగడంతో చరిత్ర సృష్టించింది. ఈ విజయం తర్వాత ఇస్రో తన తదుపరి మిషన్‌లో నిమగ్నమై ఉంది. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-4 మిషన్‌పై నిరంతరం కృషి చేస్తున్నారు. దీని ప్రారంభ తేదీపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అయితే చంద్రయాన్-4 మిషన్ 2027లో ప్రారంభిస్తారని స్పష్టమైంది.

చంద్రయాన్ 3 సాధించిన విజయాలను మించి చంద్రయాన్ 4 మిషన్ ముందుకు సాగుతుందని ఇస్రో చైర్మన్ చెప్పారు. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితల ఖనిజాలు, ఉష్ణ ప్రవణతలు(Thermal Gradients), ఎలక్ట్రాన్ క్లౌడ్స్, సిస్మిక్ యాక్టివిటీస్ వంటి అనేక ముఖ్యమైన సమచారం అందించింది. అయితే చంద్రయాన్ 4 చంద్రుని దక్షిణ ధ్రువం(సౌత్ పోల్)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమే కాకుండా చంద్రుని ఉపరితలం నమూనాలను సేకర...