భారతదేశం, ఫిబ్రవరి 17 -- అటు టీమ్ఇండియాలో చోటు కోల్పోయిన సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇటు పర్సనల్ లైఫ్ లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. భార్య ధనశ్రీ వర్మ కు అతను విడాకులు ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ భార్యభర్తల మధ్య డివోర్స్ సెటిల్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్ధమయ్యాడని తెలిసింది.

గతంలోనూ చాహల్, ధనశ్రీ విడిపోతున్నారనే ఊహాగానాలు రాగా, వీళ్లిద్దరూ ఖండించారు. కానీ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఒకరి అకౌంట్ ను మరొకరు అన్ ఫాలో చేసుకోవడంతో మరోసారి డివోర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. ధనశ్రీ అకౌంట్ ను అన్ ఫాలో చేసిన చాహల్.. ఆమె ఫొటోలను కూడా డిలీట్ చేశాడు. ధనశ్రీ మాత్రం ఫొటోలను అలాగే ఉంచింది.

కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలపై చాహల్-ధనశ్రీ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవిం...