భారతదేశం, మార్చి 15 -- రానున్న రోజుల్లో సిమెంట్​ ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మినరల్​​ ట్యాక్స్​ని విధించే అవకాశం ఉండటం ఇందుకు కారణం అని జేఎం ఫైనాన్షియల్​ నివేదిక వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈ ట్యాక్స్​ని ప్రకటించింది.

రాయల్టీలతో పాటు ఖనిజ హక్కులు, ఖనిజ సంపద కలిగిన భూములపై పన్నులు విధించడానికి రాష్ట్రాలకు అనుమతిస్తూ 2024 జులైలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి, తమిళనాడు ప్రభుత్వం మినరల్​ బేరింగ్ ల్యాండ్ టాక్స్ చట్టం, 2024ను ప్రవేశపెట్టింది.

ఈ చట్టం ప్రకారం సున్నపురాయి తవ్వకాలపై టన్నుకు అదనంగా రూ.160 పన్ను వసూలు చేయనుంది తమిళనాడు ప్రభుత్వం. 2025 ఫిబ్రవరి 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇక కర్ణాటకతో సహా ఇతర ఖనిజ సంపన...