భారతదేశం, ఫిబ్రవరి 5 -- Cellar Collapse: హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నించారు. సెల్లార్ లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం బీహార్ నుంచి వచ్చిన కార్మికులు విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by HT Digital Content Services with permission from...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.