భారతదేశం, ఫిబ్రవరి 5 -- Cellar Collapse: హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ప్రయత్నించారు. సెల్లార్‌ లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం బీహార్‌ నుంచి వచ్చిన కార్మికులు విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from...