భారతదేశం, డిసెంబర్ 6 -- CBSE Exam Dates 2023 : 2023 సీబీఎస్​ఈ పరీక్షల తేదీల వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10, 12 తరగతుల పరీక్షల టైమ్​టేబుల్స్​కు సంబంధించిన వివరాలు రిలీజ్​ అయిన తర్వాత.. సీబీఎస్​ఈ అధికారిక వెబ్​సైట్​ cbse.nic.inలోకి వెళ్లి అభ్యర్థులు చెక్​ చేసుకోవచ్చు.

గత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. ఈ నెలలోనే సీబీఎస్​ఈ 10,12 పరీక్షల తేదీలు వెలువడాల్సి ఉంది. ఈసారి తుది పరీక్షలు ఫిబ్రివరి 15 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే ప్రకటించింది సీబీఎస్​ఈ. సాధారణంగా అయితే.. పరీక్షలకు ఒకటిన్నర లేదా రెండు నెలల ముందు ఎగ్జామ్​ టైమ్​టేబుల్​ బయటకొస్తుంది.

CBSE class 10 exam time table : కొవిడ్​ కారణంగా.. గతేడాది 10, 12 తరగతుల పరీక్షలను రెండుసార్లు నిర్వహించింది సీబీఎస్​ఈ. సీఐఎస్​సీఈతో పాటు ఇతర బోర్డులు కూడా రెండుసార్లు నిర్వహ...