భారతదేశం, మార్చి 27 -- CBN In Polavaram: 2026 చివరి కల్లా పోలవరం ముంపు బాధితులకు పునరావాసం పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోలవరంలో పర్యటిస్తున్న చంద్రబాబు ముంపు బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం కోసం త్యాగాలు చేసి ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారని, వారికి అన్యాయం జరగనివ్వమన్నారు.
2014-19లో రూ.4,311కోట్లను పోలవరం ముంపు బాధితులకు చెల్లించామని చెప్పారు. తర్వాత ఐదేళ్లలో ప్రభుత్వం బాధితుల్ని పట్టించుకోలేదని, వారి గురించి ఆలోచించలేదని ఆరోపించారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉండే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే తప్ప పోలవరం నిర్మాణం సాధ్యం కాదని ఒప్పించి, వాటిని ఏపీకి తీసుకొచ్చామన్నారు. వీలైనంత వరకు న్యాయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.