భారతదేశం, మార్చి 10 -- ఉత్కంఠకు తెరపడింది! కెనడా తదుపరి ప్రధానిగా మార్క్​ కార్నీని ఆ దేశంలో అధికారంలో ఉన్న లిబరల్​ పార్టీ ఎన్నుకుంది. జస్టిన్​ ట్రూడో రాజీనామాతో ప్రధానిగా ఆయన స్థానాన్ని ఈ బ్యాంక్​ ఆఫ్​ కెనడా మాజీ చీఫ్​ భర్తీ చేయనున్నారు.

జస్టిన్​ ట్రూడో స్థానాన్ని భర్తీ చేసేందుకు లిబరల్ పార్టీలో జరిగిన రేసులో కార్నీ ముందంజలో ఉన్నారు. చివరికి, ఆయన విజయం సాధించినట్టు లిబర్​ పార్టీ అధ్యక్షుడు సచిత్​ మెహ్రా సోమవారం ప్రకటించారు.

మార్క్​ కార్నీ.. 2008 నుంచి 2013 వరకు బ్యాంక్ ఆఫ్ కెనడా 8వ గవర్నర్​గా పనిచేశారు. 2011 నుంచి 2018 వరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు చైర్మన్​గా విధులు నిర్వర్తించారు.

ఈ గోల్డ్​మన్​శాక్స్ మాజీ ఎగ్జిక్యూటివ్.. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కెనడా బయపడేందుకు కృషి చేసి వార్తల్లో నిలిచారు.

కనెడాలోని మారుమూల నార్త్ వెస్ట్ టెర...