భారతదేశం, ఫిబ్రవరి 12 -- భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంది. భారతదేశం, విదేశాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్లు ఇక్కడ ప్రవేశిస్తున్నాయి. మీరు లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం బీవైడీ సీలియన్ 7 దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు ఫిబ్రవరి 17న లాంచ్ అవుతుంది. దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 70 వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి రాబోయే ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్, స్పెసిఫికేషన్లను చూద్దాం..

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తారు. ఈ EV 82.5 kWh శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 567 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది...