భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ సీలియన్ 7ను విడుదల చేసింది. కంపెనీ జనవరి 18, 2025న జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెలలోనే 1000కి పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్‌లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.

బీవైడీ సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ 82.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 48,90,000(ఎక్స్ షోరూమ్). బీవైడీ సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా 82.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 54,90,000(ఎక్స్-షోరూమ్). కంపెనీ అత్యాధునిక ఇంటెలిజెంట్ టార్క్ అడాప్టేషన్ కంట్రోల్(iTAC), CTB (సెల్ టు బాడీ) టెక్నాలజీని ఇందులో ఉపయోగించింది. ఎక్కువ క్యాబిన్ స...