భారతదేశం, మార్చి 22 -- మష్రూమ్‌తో మనం చాలా వంటకాలు కూడా చేసుకోవచ్చు. ఇటీవల పుట్టగొడుగు లాభదాయకమైన వాణిజ్య పంటగా మారింది. చాలా మంది రైతులు వీటి సాగు వైపు మెుగ్గుచూపుతున్నారు. ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మీ రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలను చూడవచ్చు. బటన్ పుట్టగొడుగులు (Agaricus bisporus) అత్యంత ప్రాచుర్యం పొందిన పుట్టగొడుగులలో ఒకటిగా ఉంది. ఇది చాలా మృదువైన, చాలా మన్నికైన జాతి. బటన్ మష్రూమ్ సాధారణంగా మార్కెట్లలో దొరుకుతుంది. ఈ బటన్ మష్రూమ్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం..

బటన్ మష్రూమ్‌లు బి విటమిన్లు, విటమిన్ డి, సెలీనియం, కాపర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఖనిజాల వంటి ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం, మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.

బటన్ మష్రూమ్‌లలో సెలీనియం అనే మూలకం ఉంటుంది. ఇది రోగన...