భారతదేశం, ఏప్రిల్ 11 -- వివో సబ్ బ్రాండ్ ఐక్యూ తన బడ్జెట్ జెడ్ సిరీస్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ని భారతదేశంలో విడుదల చేసింది. అవి ఐక్యూ జెడ్ 10 5జీ, ఐక్యూ జెడ్ 10ఎక్స్ 5జీ. ఈ రెండు ఫోన్స్​ బ్యాటరీ లైఫ్.. 7,300 ఎంఏహెచ్, 6,500 ఎంఏహెచ్. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​ ధరలు, స్పెసిఫికేషన్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐక్యూ జెడ్10 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999.

రూ.2,000 ఇన్​స్టంట్ డిస్కౌంట్ లేదా అదే మొత్తంలో ఎక్స్​ఛేంజ్ బోనస్ కూడా ఐక్యూ ఆఫర్​ చేస్తోంది. ఇది వాస్తవ ధరలను వరుసగా రూ .19,999, రూ .21,999, రూ .23,999 కు తగ్గిస్తుంది.

ఐక్యూ జెడ్10ఎక్స్ 5జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ర...