భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్.. విక్షిత్ భారత్, జీరో పావర్టీ లక్ష్యమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో యువత, రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. రైతుల కోసం కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు.

పీఎం ధన్ ధాన్య యోజన పథకాన్ని 100 జిల్లాల్లో అమలు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పథకంలో భాగంగానే పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక ఉంటుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కొత్త స్కీమ్ ద్వారా 1.7 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుందని ఆర్థిక మంత్రి అన్నారు. రాష్ట్రాలతో కలిసి దీన్ని ప్రారంభించి, అవకాశాలను సృష్టించాల...