భారతదేశం, జనవరి 27 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం చివరిలో, అంటే.. ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025​ని ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్మల బడ్జెట్​ని తీసుకురావడం ఇది 8వసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడొవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం నిర్మల ప్రవేశపెడుతున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్​. ఈ నేపథ్యంలో బడ్జెట్​కి సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 న పార్లమెంట్​లో బడ్జెట్ 2025​ని ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు లోక్​సభలో ఆమె ప్రసంగం ప్రారంభమవుతుంది.

గత నాలుగు కేంద్ర బడ్జెట్​లు, ఒక మధ్యంతర బడ్జెట్ మాదిరిగానే 2025-26 పూర్తి కేంద్ర బడ్జెట్​ సైతం కాగిత రహిత రూపంలోనే ఉండనుంది.

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా.. నిర్మ...