తెలంగాణ,కొడంగల్, జనవరి 29 -- Kodangal Assembly Constituency: కొడంగల్... రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అత్యంత ఆసక్తికరంగా రాజకీయాలు జరిగే సీటు..! రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాగైనా ఈ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావించినా... 2014 లో వర్కౌట్ కాలేదు. కానీ 2018లో జరిగిన ముందస్తు ఎలక్షన్స్ లో గులాబీ జెండా రెపరెపలాడింది. అప్పట్లో ఈ ఫలితం అందరిలోనూ ఆసక్తిని రేపింది. కారణం.. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..! బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శించే రేవంత్ రెడ్డి... అనూహ్యంగా ఇక్కడ్నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్లాన్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లు అయింది. కట్ చేస్తే... మళ్లీ రేవంత్ రెడ్డి కొడంగల్ పై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదిపే పనిలో పడ్డారు. ఫలితంగా వచ్చే ఎన...