Hyderabad, మార్చి 13 -- Brahma Anandam OTT Release Date: ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, అతని తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించిన మూవీ బ్రహ్మా ఆనందం. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

బ్రహ్మా ఆనందం మూవీ హోలీ సందర్భంగా శుక్రవారం (మార్చి 14) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. త్వరలోనే రానుంది.

ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధంతో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

బ్ర‌హ్మానందం కేవ‌లం కామెడీకే ప‌రిమితం కాకుండా అప్పుడ‌ప్పుడు త‌న‌లోని న‌ట‌నా వైవిధ్య‌త‌ను చాటిచెప్పే క్యారెక్ట‌ర్స్ చేశాడు. ఆయ‌న్ని పూర్...