భారతదేశం, మార్చి 18 -- Bold OTT: త‌మిళ్ బోల్డ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఫైర్ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఈ కోలీవుడ్ మూవీలో బాలాజీ మురుగ‌దాస్ హీరోగా న‌టించాడు. సాక్షి అగ‌ర్వాల్‌, చాందిని త‌మిళ‌రాస‌న్‌, ర‌చితా మ‌హాల‌క్ష్మి కీల‌క పాత్ర‌లు పోషించారు.

బోల్డ్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను టెంట్ కోట ద‌క్కించుకున్న‌ది. మార్చి 21 నుంచి ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. టెంట్ కోట‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.ఫైర్ మూవీకి జేఎస్‌కే స‌తీష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డీకే మ్యూజిక్ అందించాడు.

2020లో నాగ‌ర్‌కోయిల్‌లో సంచ‌ల‌నం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు ఆధారంగా ఈ మూవీ రూపొందింది. బోల్డ్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు స‌తీష్ ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించాడు. ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లో రిల...