భారతదేశం, ఫిబ్రవరి 11 -- Bird Flu Effect : ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం మండలంలోని కోళ్లకు వైరస్ నిర్థారణ అయ్యింది. ఈ మండలంలో 2 రోజుల్లోనే 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకి చనిపోయిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు పౌల్ట్రీ నిర్వాహకులను ఆదేశించారు. ఈ మండలం చుట్టుపక్కల 10 కి.మీ పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. అయితే 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు.
ఏపీలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.