భారతదేశం, ఫిబ్రవరి 11 -- Bigg Boss Utsavam: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 కంటెస్టెంట్స్ అంద‌రూ క‌లిసి మ‌ళ్లీ ఒకే స్టేజ్‌పై క‌నిపించ‌బోతున్నారు. త‌మ ఆట పాట‌ల‌తో సంద‌డి చేయ‌బోతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్‌తో స్టార్ మా బిగ్‌బాస్ ఉత్స‌వం పేరుతో స్పెష‌ల్ టీవీ షోను ప్లాన్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 16న బిగ్‌బాస్ ఉత్స‌వం షో టెలికాస్ట్ కాబోతుంది. సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ షో ప్ర‌సార‌మ‌వుతుంద‌ని స్టార్ మా అనౌన్స్‌చేసింది. బిగ్‌బాస్ ఉత్స‌వం తాలూకు ప్రోమోను రిలీజ్ చేసింది.

ఈ బిగ్‌బాస్ ఉత్స‌వం షోకు హీరోలు సందీప్‌కిష‌న్‌, విశ్వ‌క్‌సేన్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు గెస్ట్‌లుగా రాబోతున్నారు. ఈ షోలో బిగ్‌బాస్ సీజ‌న్ 8 విన్న‌ర్ నిఖిల్‌, ర‌న్న‌ర‌ప్స్ గౌత‌మ్ కృష్ణ‌, ప్రేర‌ణ‌, న‌బీల్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ పాల్గొన్నారు....