భారతదేశం, ఏప్రిల్ 12 -- BHEL Paper Leak : విశాఖ‌ప‌ట్నం భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (భెల్)లో సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీ చేసే ఆన్‌లైన్ ప‌రీక్ష పేప‌ర్‌ను లీక్ చేశారు. డ‌బ్బులు తీసుకుని ప‌రీక్షకు సంబంధించిన ప‌త్రాల‌ను లీక్ చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోని సంచ‌ల‌నం అయింది.

ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా పెందుర్తి స‌మీపంలో జియోన్ టెక్నాల‌జీస్ కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం భెల్‌లో సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీ కోసం జియోన్ టెక్నాల‌జీస్ ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వహించింది. శుక్రవారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ ప‌రీక్షకు విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, పార్వతీపురం మ‌న్యం, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, అల్లూరి సీతారామ‌రాజు జిల్లా, కాకినాడ‌, తూర్పుగోదావ‌రి, బి.ఆర్ అం...