భారతదేశం, ఫిబ్రవరి 19 -- Bhairathi Ranagal Review: క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్ న‌టించిన భైర‌తి ర‌ణ‌గ‌ల్ మూవీ తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌ఫ్టీకి ప్రీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు నార్త‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టించింది. భైర‌తి ర‌ణ‌గ‌ల్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

భైర‌తి ర‌ణ‌గ‌ల్‌ది (శివ‌రాజ్‌కుమార్‌) రోణాపురం. ఊళ్లోని నీటి స‌మ‌స్య‌ను తీర్చే క్ర‌మంలో ప్ర‌భుత్వ ఆఫీస్‌లో బాంబు పెడ‌తాడు. ఈ నేరానికిగాను 21 ఏళ్లు జైలు శిక్ష‌ను అనుభ‌విస్తాడు. జైలులో చ‌దువుకొని లాయ‌ర్ ప‌ట్టా అందుకుంటాడు. జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత రోణాపురంలో లాయ‌ర్‌గా ప్రాక్టీస్ చేస్తూ పేద‌ల‌కు అండ‌గా నిలుస్తాడు. రోణాపురంలోని స్టీల్ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే రెండు వేల‌ మ...