భారతదేశం, ఏప్రిల్ 5 -- శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ముస్తాబైంది. ఈ నెల 6, 7వ తేదీల్లో శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం జరగనుంది. వీటిని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భద్రాచలం వస్తున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసు, సమాచార శాఖ ఆధ్వర్యంలో ఓ క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు.

ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. భద్రాచలంలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు అన్ని తెలుసుకోవచ్చు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ప్రసాదాల కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లు, వాష్ రూమ్స్, ఉచిత వైద్య శిబిరం.. ఇలా అన్ని విషయాలు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తెలుస్తాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ క్యూఆర్ కోడ్‌ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.

భద్రాచ...