భారతదేశం, మార్చి 26 -- Bhadrachalam Building Collapse : భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. భద్రాచలం సూపర్ బజార్ సెంటర్ లోని 6 అంతస్తుల మేర భవనాన్ని స్లాబ్ వేసి వదిలేశారు. ఈ భవనం బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. బిల్డింగ్ శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాత బిల్డింగ్ పైనే మరో నాలుగు అంతస్తులు కడుతుండడంతో ఈ ప్రమాదం జరిగింది.

నిర్మాణ లోపాల కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. భవన నిర్వాహకులు ట్రస్ట్‌ పేరుతో విరాళాలు సేకరించి ఈ భవనం నిర్మాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున...