భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఆడియో, వేరబుల్స్ విభాగం నుంచి విస్తరిస్తూ, బోట్​ సంస్థ ఇప్పుడు ఇన్-కార్ సేఫ్టీ (కార్ రక్షణ) పరికరాల రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తన 'హైవ్​ డ్యాష్​క్యామ్​' సిరీస్‌ను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 2,499 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఈ బోట్​ హైవ్ డ్యాష్‌క్యామ్ రేంజ్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి:

ఎఫ్​1 మోడల్: దీని ధర రూ. 9,990.

ఎం1 మోడల్: దీని ధర రూ. 4,499.

ఈ1 మోడల్ (ఎంట్రీ లెవల్): దీని ధర రూ. 2,499.

ఈ డ్యాష్‌క్యామ్‌లు ప్రైవేట్ కార్ల యజమానులు, ప్రతిరోజూ ప్రయాణించే వారు, కమర్షియల్ వాహన నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని తయారయ్యాయి.

సెన్సార్లు: ఈ మూడు డ్యాష్‌క్యామ్‌లు సోనీ స్టార్​విస్​ సెన్సార్లతో వస్తున్నాయి. ఇవి తక్కువ వెలుతురులో, హై-గ్లేర్ (ఎక్కువ వెలుతురు) ఉన్న సమయంలో రికార్డింగ్ స్పష్టతను పెంచుతాయి.

బోట్​ హైవ్​...