భారతదేశం, జనవరి 28 -- బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో హీట్​ని మరింత పెంచుతూ సరికొత్త గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసింది లావా. ఈ మోడల్​ పేరు లావా యువ స్మార్ట్​. దీని ధర కేవలం రూ. 6వేలు! ఇంత తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్​ని సంస్థ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లావా యువ స్మార్ట్ స్మార్ట్​ఫోన్ యూఎన్​ఐఎస్​ఓసీ 9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.75 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లేని ఈ మొబైల్​ కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ పరంగా, లావా యువ స్మార్ట్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇందులో మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఏఐ కెమెరా ఉంది. విభిన్న లైటింగ్​లో మంచి ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఇది హెచ్​డీఆర్, పోర్ట్రెయిట్- నైట్...