భారతదేశం, ఫిబ్రవరి 15 -- సాఫ్ట్‌వేర్ రాజధాని బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త ఊపును సంతరించుకుంది. కేవలం స్థానికులే కాదు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (ఎన్​ఆర్​ఐలు) సైతం ఇప్పుడు బెంగళూరులో ఇళ్లను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు! ప్రధానంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు బెంగళూరులోని ఐటీ ఎకోసిస్టమ్‌తో ఉన్న అనుబంధం, రూపాయి విలువతో పోలిస్తే డాలర్ అడ్వాంటేజ్ వంటి అంశాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సురక్షితమని భావిస్తున్నారు. భవిష్యత్తులో తిరిగి భారత్‌కు వచ్చే ఆలోచన ఉన్నవారు, రిటైర్మెంట్ ప్లాన్స్‌లో భాగంగా ముందస్తుగానే ఇక్కడ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. మరి బెంగళూరులో ఎన్​ఆర్​ఐలు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? ఇక్కడ తెలుసుకోండి..

బెంగళూరు రెసిడెన్షియల్ మార్కెట్‌లో జరుగుతున్న విదేశీ లావాదేవీల్లో అమెరికా ఎన్​ఆర్​ఐల వాటానే అత్యధికంగ...