భారతదేశం, మే 6 -- కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం తయారు చేసేందుకు సమయం ఉండదు. ఏదైనా త్వరగా చేసుకుని తినాలని అనుకుంటాం. కానీ ఏం చేయాలో అర్థంకాదు. అలాంటివారు బీట్ రూట్ క్యారెట్ రైస్ చేయండి. ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేయవచ్చు. చిన్నలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడానికి సమయం కూడా పెద్దగా పట్టదు. ఎలా చేయాలో తెలుసుకుందాం..

మీరు త్వరగా భోజనం తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రెసిపీ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే భోజనం చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఈ వేసవిలో మరింత కష్టం. ప్రతిరోజూ వివిధ రకాలుగా మధ్యాహ్న భోజనం చేయడం ఒక సవాలుగా ఉంటుంది.

అయితే బియ్యాన్ని ఉపయోగించి చేసే పులిహోర, పలావ్, రైస్‌బాత్ లాంటివి మాత్రమే కాదు.. మీరు బీట్‌రూట్, క్యారెట్ రైస్ ప్రయత్నించారా? మీరు క్యారెట్, బీట్‌రూట్‌లతో రుచికరమైన అన్నం చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ద...