భారతదేశం, డిసెంబర్ 2 -- బేర్​ గ్రిల్స్​.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది.. అడవుల్లో, పర్వతాల్లో, ప్రకృతి మధ్య సాహసాలు చేసే ఒక అసాధారణ వ్యక్తి! అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సాహసికుడిగా పేరు సంపాదించుకున్న బేర్​ గ్రిల్స్​.. ఇంట్లో ఏం తింటారో తెలుసా? 51ఏళ్ల వయస్సులోనూ ఇంత ఫిట్​గా ఎలా ఉన్నారో తెలుసా?

తన రోజువారీ డైట్​ ప్లాన్​ని వెల్లడిస్తూ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ఇటీవలే షేర్​ చేశారు బేర్​ గ్రిల్స్​. ఆశ్చర్యకరంగా, ఆయన డైట్ చాలా సాధారణంగా, ఆరోగ్యకరంగా ఉంది. ఆయన ఆహార సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉంది: రియల్​ ఫుడ్​, తక్కువ హడావుడి, సాహసాలకు సిద్ధంగా ఉండటానికి సరిపడా శక్తి!.

"నేను ఒక రోజులో నిజంగా తినేది ఇదే. నేను ఎప్పుడూ ఆహారాన్ని సాధారణంగా, సహజంగా, రైతుల నుంచి లభించేలా చూసుకుంటాను. ముందుగా బయటికి వెళ్లి, ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటా...